లాక్‌డౌన్ పోకముందే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ పోకముందే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది. జనాలు, వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వైరస్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా.. లాక్‌డౌన్‌ను ఇంకొంత కాలం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి ఈ తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ఎత్తేసే సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రజలు ఆర్టీసీ బుకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆర్టీసీ బస్ బుకింగ్స్ ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 15 నుంచి తమ ప్రయాణాల కోసం బస్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఏసీ బస్సుల బుకింగ్స్‌ను మాత్రం నిలిపివేసింది. అయితే బస్సు సర్వీసులను విజయవాడ బస్టాండ్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే ప్రారంభించింది. 115 సర్వీసులకు టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించిన ఆర్టీసీ.. కరోనా ప్రభావం తగ్గితే దశల వారీగా మరిన్ని బస్సుల బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది.

అయితే పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్‌డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది. ఇప్పటికే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. మళ్లీ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనను పక్కన పెడుతుందని అధికార వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఏపీలో 314 కేసులు నమోదుకాగా.. అయిదుగురు డిశ్చార్జ్ కావడంతో 306 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడి ముగ్గురు చనిపోయారు.

For More News..

రూ. 1000 కే కరోనా క్లీనింగ్​ మెషిన్

ఫేక్​ న్యూస్​ వైరల్ ​చేస్తే కేసు బుక్కే!

దేశంలో 5,351కు చేరిన కరోనా కేసులు

ఈ నెల కొత్త కరెంట్ బిల్లు రాదు