పంజాబ్‌లోని వాఘా– అట్టారీ బోర్డర్ వద్ద ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ‘మై వాపస్ అవూంగా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) త్యాగాలకు నివాళిగా నిర్వహించిన ఈ కాన్సర్ట్‌లో పలు దేశభక్తి పాటలు పాడారు రెహమాన్ టీమ్. ఆయనతో పాటు సింగర్ మోహిత్ చౌహన్, డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, హీరో వేదాంగ్ రైనా పాల్గొన్నారు.
ఇండియా - పాకిస్థాన్ దేశవిభజన నేపథ్య కథతో ‘మై వాపస్ అవూంగా’ సినిమా వస్తోంది. దిల్జీత్ దోసంజ్, నసీరుద్దీన్ షా, వేదాంగ్ రైనా, శర్వరీ లీడ్ రోల్స్‌లో ఇంతియాజ్ అలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 12న సినిమా విడుదలవుతోంది.
