
- కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో
- ఘనంగా అరబిక్ భాషా దినోత్సవం
ముషీరాబాద్,వెలుగు: అరబిక్ అతి ప్రాచీనమైన భాష అని ఇఫ్లూ వర్సిటీ ప్రొఫెసర్ సయ్యద్ జహంగీర్ పేర్కొన్నారు. అరబిక్ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో అరబిక్ భాషా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఆకాశవాణిలో నా వాణి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచంలో అరబిక్ ఆరో భాషగా గుర్తింపు పొందిందని , దానిపై విద్యార్థులు స్టడీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ ఫ్యాకల్టీ, కళాశాల అరబిక్ భాష అధ్యక్షుడు ఎంఎఫ్ రెహమాన్, విద్యార్థులు పాల్గొన్నారు.