గణేశుని ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంప్రదాయం ప్రకారం.. వీధుల్లో.. గణపతి ప్రతిమను ఉంచి పూజలు చేసేవారు అనంత చతుర్దశి రోజున గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు.అయితే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి సెప్టెంబర్ 25న ఏ సమయంలో శుభ ముహూర్తం ఉందో తెలుసుకుందాం. . .!
దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు ( సెప్టెంబర్ 24 నాటికి) వచ్చాయి. రేపు (సెప్టెంబర్ 25) గణేషుడిని గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఈ ఏడాది ( 2026) సెప్టెంబర్ 14ప్రజలు అంగరంగ వైభవంగా వినాయక చవితి పూజను జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఈ ఈ రోజు వరకు ( సెప్టెంబర్ 24 వరకు) హిందువులు వినాయకుడి పూజించారు. ప్రతి వీధిలో.. ప్రతి అపార్ట్ మెంట్లలో అన్నదానాలు నిర్వహిస్తూ భక్తి ప్రవృత్తిని చాటుకున్నారు.
ఈ ఏడాది ( సెప్టెంబర్ 25) అనంత చతుర్దశి రోజున పది రోజుల పాటు గణేశుని ఉత్సవాలు ఎంతో భక్తిగా పూజించిన భక్తులు అనంత చతుర్దశి రోజున గణపయ్య విగ్రహాన్ని నిమజ్జనం చేసి భక్తులు వేడుకలకు ముగింపు పలుకుతారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి వచ్చింది . ఆ రోజున గణపతి నిమజ్జనానికి అనుకూల సమయాలు ఉదయం 6:11 నుంచి 10:42 వరకు, మధ్యాహ్నం 12:13 నుంచి 1:43 వరకు, సాయంత్రం 4:44 నుంచి 6:14 వరకు, రాత్రి 9:14 నుంచి 10:43 వరకు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
