వినాయక నిమజ్జనం.. ఆధ్యాత్మికమా.. శాస్త్రీయమా.. అసలు రహస్యం ఇదే..!

 వినాయక నిమజ్జనం.. ఆధ్యాత్మికమా.. శాస్త్రీయమా.. అసలు రహస్యం ఇదే..!

దేశ వ్యాప్తంగా వినాయకుడికి అత్యంత వైభవంగా పూజలు జరిగాయి.  గణేష్​ నవరాత్రి ఉత్సవాలు ప్రతి వీధిలో ఎంతో  వైభవంగా పూజలు చేశారు.  తరువాత అనంత చతుర్దశి రోజున సెప్టెంబర్​ 25న గణపతి బప్పా.. మోరియా అంటూ నీళ్లల్లో నిమజ్జనం చేస్తూ గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఈ కార్యక్రమానికి మండపాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  అసలు వినాయన నిమజ్జన కార్యక్రమం కేవలం ఆధ్యాత్మికమేనా.. సైన్సు ప్రకారం శాస్త్రీయ రహస్యం ఉందా.. అటు పండితులు.. ఇటు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు.మొదలగు విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

వినాయక నిమజ్జన కార్యక్రమానికి భక్తులు తయారవుతున్నారు.  మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి రోజులు ఘనంగా  పూజలు నిర్వహించారు.  వినాయకచవితి పండుగ   వర్షాకాలంలో వస్తుంది. అధికంగా వర్షాలు పడటంతో .. చెరువులు.. నదులు.. కొలనులు బురదతో పేరుకు పోయి ఉంటాయి. ఒండ్రు మట్టి కోసం జలాశయంలో మట్టిని  తీయడంవల్ల పూడిక తీసినట్లు అవుతుంది..అప్పుడు  నీళ్లు తేట పడతాయి..

వినాయకుడి  బొమ్మలను మట్టితో చేయడం వలన  అందులోని  ఉన్న ఔషధగుణాలు  పూజలు చేసిన వారికి ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద వైద్యులు   చెబుతున్నారు. అంతేకాకుండా  ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు తొలగిపోయి నీరు శుద్ధి చేయబడతాయి.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి నీటిని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని  నిపుణులు చెబుతున్నారు.       

వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం వెనుక కూడా మరో కారణం ఉంది.మట్టితో చేసిన విగ్రహాలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే దైవత్వం ఉంటుందని, తొమ్మిది రోజుల తర్వాత మట్టి విగ్రహాలను పూజించినప్పటికీ అందులో ఏ విధమైనటువంటి దైవ శక్తులు ఉండవని, అందుకోసమే తొమ్మిదవ రోజు ఈ విధమైనటువంటి వినాయకుడి ప్రతిమలను నిమజ్జన చేయాలని పండితులు చెబుతున్నారు.  

ప్రస్తుత కాలంలోఎన్నో రసాయనాలను ఉపయోగించి వినాయకుడి విగ్రహాలను తయారు చేయటం వల్ల వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసిన తరువాత నీరు పెద్ద మొత్తంలో కలుషితమై ఎన్నో జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది.