Nayanthara Hi OTT release : ఓటీటీలోకి నయనతార రోమాంటిక్ డ్రామా 'హాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Nayanthara Hi OTT release : ఓటీటీలోకి నయనతార రోమాంటిక్ డ్రామా 'హాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ కాంబినేషన్ లో వచ్చిన రోమాంటిక్ ఎంటర్టైనర్ 'హాయ్' (Hi)  . ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం కోలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ మంచి హైప్ క్రియేట్ చేసింది. విష్ణు ఎడవన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేసిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. రిలీజైన కొద్ది రోజుల్లోనే డిజిటల్ ప్రిమియర్ కి సిద్ధమవ్వడంతో ఫ్యాన్స్ అప్పుడే స్క్రీన్లకు అతుక్కుపోవడానికి రెడీ అయిపోతున్నారు.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 25, 2026న ఈ చిత్రం జీ5లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తమిళ వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో తెలుగు వెర్షన్ కూడా విడుదలైనప్పటికీ.. ఓటీటీలో తెలుగు రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కథేంటంటే?

ఊరిలో చిన్ననాటి ప్రేమ విఫలమై, గుండె కోతతో చెన్నై నగరంలో అడుగుపెడతాడు అమాయకుడైన మయిల్ (కవిన్). అనుకోకుండా నచ్చని పెళ్లి నుంచి తప్పించుకుని పారిపోతున్న దేవయాని (నయనతార) అనే ధైర్యవంతురాలైన అమ్మాయి అతనికి పరిచయమవుతుంది. పరిచయం కాస్తా రానురానూ ప్రేమగా మారుతుంది. అయితే వీరిద్దరినీ వెతుక్కుంటూ కుటుంబ సభ్యులు రావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

దేవయానిని కాపాడుకోవడానికి మయిల్ ఒక మైండ్ బ్లాకింగ్ అబద్ధం చెబుతాడు. దేవయాని తన వల్ల గర్భవతి అని, ఆ విషయాన్ని నమ్మించడానికి తానో పాకిస్తానీ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని ఒక క్రేజీ కథ అల్లేస్తాడు. ఈ ఒక్క చిన్న డ్రామా వల్ల ఆ తర్వాత జరిగే కామెడీ రచ్చ, ఆ అబద్ధం ఒక అనూహ్యమైన పెళ్ళికి ఎలా దారితీసిందనేది సినిమాకే హైలైట్.

ఈ చిత్రంలో ప్రభు, భాగ్యరాజ్, రాధికా శరత్ కుమార్, విటీవీ గణేష్, పూర్ణిమ భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుహాసిని మణిరత్నం ప్రత్యేక పాత్రలో మెరిసారు. విగ్నేష్ శివన్, నయనతారలతో కలిసి ఎస్.ఎస్.లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జెన్ మార్టిన్ స్వరపరిచిన పాటలు కథకు మంచి ఫీల్ అందించాయి. థియేటర్లలో మిస్ అయినవారు ఈ క్రేజీ అండ్ ఫన్నీ రోమాంటిక్ డ్రామాను జీ5లో హ్యాపీగా వీక్షించవచ్చు..