అవి ఎముకల గూళ్లు: దేవుడి కోసం పిల్లల బలి

అవి ఎముకల గూళ్లు: దేవుడి కోసం పిల్లల బలి

పెరూలో ఒకే చోట 227 మంది పిల్లల ఎముకల గూళ్లు

ఒక చోటు.. తవ్విన కొద్దీ విరిగిపోయిన ఎముకల గూళ్లు బయట పడుతున్నాయి. ఒకటా రెండా.. మొత్తం 227 మంది పిల్లల అస్థిపంజరాలవి. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అందరినీ ఒకేసారి ఇలా బలిచ్చారట. పెరూలోని హువాన్​చాకో అనే పట్టణంలో ఈ సామూహిక బలి స్పాట్​ను ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు. 1475లో ఈ సామూహిక బలి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అందరూ నాలుగేళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలేనని పెరూ చీఫ్​ ఆర్కియాలజిస్టు ఫెరెన్​ కాస్టిలో చెప్పారు.

ప్రీ కొలంబియన్​ షిము సంస్కృతిలో భాగంగా దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలు ఇలా పిల్లలను బలిచ్చేవారన్నారు. అప్పట్లో ఎల్​నినో పరిస్థితులు తీవ్రంగా ఉండేవని, వర్షాలు పడకపోవడంతో దేవుడిని పూజించి ఉండొచ్చని అన్నారు. అయితే, ఈ సామూహిక బలి మాత్రం వర్షాలు బాగా పడినప్పుడే జరిగిందన్న ఆధారాలున్నాయని, బహుశా, వర్షాలు పడినందుకు మొక్కుగా పిల్లలను బలిచ్చి ఉంటారని చెప్పారు. బలిచ్చిన పిల్లల మొహాలన్నీ సముద్రం వైపు ఉన్నాయని, కొన్ని అస్థిపంజరాలకు ఇంకా మాంసం ముద్ద, వెంట్రుకలు ఉన్నాయని చెప్పారు. కాగా, ఇంతకుముందు ఈ ఏడాది మొదట్లో హువాన్​చాకోలోనే 269 మంది పిల్లలు, 466 లామా (ఓ రకం జంతువు)లను బలిచ్చిన ఆనవాళ్లు బయటపడ్డాయి.

 మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి