ప్యారిస్: భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో దీపిక నెంబర్ వన్ పొజిషన్‌లో నిలిచింది. 27 ఏళ్ల ఈ రాంచీ ప్లేయర్.. 2012లో తొలిసారిగా నెంబర్ వన్ ర్యాంకును అందుకుంది. ఆ తర్వాత తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత నెంబర్ వన్ చైర్‌ను దక్కించుకుంది. రీసెంట్‌గా జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో దీపిక హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ గెలిచింది. అంకితా భాకట్, కోమాలికా బారితో కలసి రికర్వ్ టీమ్ విభాగంలో రెండు బంగారు పతకాలు నెగ్గిన దీపిక.. వ్యక్తిగత విభాగంలో మరో గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

