లడఖ్‌లో కుప్పకూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్.. ముగ్గురికి గాయాలు

లడఖ్‌లో కుప్పకూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్.. ముగ్గురికి గాయాలు

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లడక్‏లో విమాన ప్రమాదం జరిగింది. భారత సైన్యానికి చెందిన తేలికపాటి చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. 2026, మే 20న జరిగిన ఈ ఘటనలో డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ సచిన్ మెహతాతో సహా ముగ్గురు సైనికులు గాయపడ్డారు. స్థానిక పోలీసులు, ఆర్మీ రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురినీ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు సైన్యం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, చీతా హెలికాప్టర్‌ను భారత సైన్యం లడఖ్ వంటి ఎత్తైన ప్రాంతాలలో రవాణా, కార్యాచరణ విధుల కోసం ఉపయోగిస్తుంది.