తాండూరు వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్ బోయిని మల్లేశం(28) ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన మల్లేశం కష్టపడి సైన్యంలో ఉద్యోగం సాధించాడు. తన ముగ్గురు అక్కాచెల్లెళ్ల వివాహాలను ఘనంగా చేశాడు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్లో డ్యూటీ చేస్తున్నాడు.
మల్లేశానికి ఆరు నెలల క్రితమే పెండ్లయ్యింది. తర్వాత డ్యూటీలో జాయిన్అయిన మల్లేశం రెండు రోజుల కిందటే ఊరికి వచ్చాడు. అయితే, సోమవారం ఉదయం అందరూ లేచి చూసేసరికి ఉరివేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
