SA vs IND,1st ODI: అర్షదీప్ అదరహో..తొలి ఓవర్లోనే రెండు వికెట్లు

SA vs IND,1st ODI: అర్షదీప్ అదరహో..తొలి ఓవర్లోనే రెండు వికెట్లు

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసుకొని సఫారీలకు బిగ్ షాక్ ఇచ్చాడు. తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు ఇవ్వగా.. నాలుగు, అయిదో బంతికి వికెట్లు తీసాడు. దీంతో ఆతిధ్య జట్టు 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగా ముఖేష్ కుమార్ వేసిన తొలి ఓవర్లో వైడ్ రూపంలో ఒకటే పరుగు వచ్చింది. ఇక అర్షదీప్ వేసిన రెండో ఓవర్ లో నాలుగో బంతికి ఓపెనర్ హేన్డ్రిక్స్ ను క్లీన్ బౌల్డ్ చేయగా.. అయిదో బంతికి వాండెర్ డస్సెన్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 4 ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. కెప్టెన్ మార్కరమ్(0), జార్జ్ (7) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.