బాలయ్య షోలో ఇద్దరు కుర్రాళ్లు

బాలయ్య షోలో ఇద్దరు కుర్రాళ్లు

టాక్​ షోల్లో  బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే’ ఎంత పాపులరో తెలిసిందే. దాంతో ఆడియెన్స్​ని మళ్లీ ఎంటర్​టైన్ చేసేందుకు ఈమధ్యే రెండో సీజన్ తెచ్చింది ఆహా.  మొదటి ఎపిసోడ్ హిట్ తర్వాత సినిమా హీరోలు గెస్టులుగా వచ్చిన రెండో ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేసింది. ‘ఇండస్ట్రీలో చాలామంది కుర్రాళ్లను చూస్తుంటాను. అంతమంది కుర్రాళ్లలో నా మనసు దోచుకున్నవాళ్లని మీ ముందుకు తీసుకొస్తున్నాను’ అని చెప్పగానే... హీరోలు  విష్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ ఎంటర్ అవుతారు.

తన ఉంగరాల జుట్టు ‘మెస్సీ లుక్’ అని సిద్ధూ చెప్పగానే.. బాలకృష్ణ తాను మెస్సీ లుక్​లో కనిపించిన  సినిమాల గురించి సెటైరికల్ డైలాగ్ చెప్పి నవ్విస్తాడు. వాళ్ల ఫ్రెండ్​షిప్, ఇప్పటి  క్రష్​ గురించి అడిగాడు. ప్రోమోలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్​ గురించి ఆసక్తికర విషయం చెప్తాడు. ఈ ఎపిసోడ్ ఆహాలో శుక్రవారం (అక్టోబర్ 21) టెలికాస్ట్​ కానుంది.