ద్రవిడియన్లు, ఆదివాసీలదే భారత్

ద్రవిడియన్లు, ఆదివాసీలదే భారత్

మహారాష్ట్ర భివండిలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవిడియన్లు, ఆదివాసీలదే  భారత్ కానీ..  మోడీ, అమిత్ షా, ఓవైసీ, థాక్రేలది కాదని కామెంట్ చేశారు. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుంచి జనం వలసలతో భారత్ ఏర్పడిందని  ఓవైసీ అన్నారు. మొఘల్స్ తర్వాతే బీజేపీ, ఆరెస్సెస్ వచ్చాయన్నారు.

మరోవైపు ఎన్సీపీ నేతలపైనా విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలను అడ్డుకునేందుకు ఎన్సీపీ నేతలు ఒవైసీకి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల తర్వాత ఎన్సీపీ శివసేనను పెళ్లి చేసుకుందని... కానీ  మూడు (శివసేన,ఎన్సీపీ,బీజేపీ) పార్టీల్లో పెళ్లికూతురు ఎవరో తనకు తెలియదన్నారు అసదుద్దీన్ ఒవైసీ.

‘మహారాష్ట్రలోని భివాండీలో జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..భారతదేశం నాది కాదు, థాక్రేది కాదు. (పీఎం) మోడీ, షాలది కూడా కాదు. భారతదేశం ఎవరికైనా చెందితే.. అది ద్రావిడులు, ఆదివాసీలది. మొఘలుల తర్వాత  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వచ్చాయి. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుండి వచ్చిన వలసలతో  భారత్ ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలను అడ్డుకునేందుకు ఎన్సీపీ నేతలు ఒవైసీకి ఓటు వేయాలి. ఎన్నికల తర్వాత ఎన్సీపీ శివసేనను పెళ్లి చేసుకుంది. అయితే మూడు ( ఎన్సీపీ,బీజేపీ,శివసేన) పార్టీల్లో పెళ్లికూతురు ఎవరో నాకు తెలియదు’’అని అన్నారు.