కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంహెచ్) ఆఫీస్లో మంగళవారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉద్యోగుల సంఘం చైర్మన్ మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
కోఠి, వెలుగు
