టాలీవుడ్ నటి అషు రెడ్డిపై చీటింగ్ ఆరోపణలతో హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తన వెర్షన్‌ను తీసుకోకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని అషు రెడ్డి తన పిటిషన్‌లో వెల్లడించింది.
అసలేం జరిగిందంటే:
ఫిర్యాదు ప్రకారం, 2018లో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమ, పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లండన్‌లో పనిచేస్తున్న ఆ ఇంజనీర్ నుంచి సుమారు రూ.9.5 కోట్లు తీసుకుని, ఆ డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు సదరు ఫిర్యాదు దారుడు ఆరోపించారు. పలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ : భర్త జాకీ చేత సారీ చెప్పించిన రకుల్..
ఈ కేసులో అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై అషురెడ్డి స్పందిస్తూ, తనపై వస్తున్న వార్తలు అబద్ధమని, తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి హైకోర్టుని ఆశ్రయించింది.

