
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ 1. గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోయింది. తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా మిగతా భాషల్లోనూ దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది.
తాజాగా ప్రకటించిన 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్లలో పొన్నియన్ సెల్వన్ ఆరు కేటగిరీల్లో నామినేట్ ఇయింది. ఈ మేరకు ఏషియన్ ఫిల్మ్ అవార్డ్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. మార్చి 12న హాంకాంగ్ హ్యాలెస్ మ్యూజియంలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.
పొన్నియన్ సెల్వన్ 1 నామినేషన్ దక్కించుకన్న కేటగిరీల వివరాలు..
బెస్ట్ ఫిల్మ్ – పొన్నియన్ సెల్వన్
బెస్ట్ ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్
బెస్ట్ కొరియోగ్రఫీ – రవి వర్మన్
బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ – ఏఆర్ రెహ్మాన్
బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్ – ఏకా లఖానీ
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – తోట తరణి