మద్యం మత్తులో స్నేహితుడి హత్య.. హైదరాబాద్ కోకాపేటలో ఘటన

మద్యం మత్తులో స్నేహితుడి హత్య.. హైదరాబాద్ కోకాపేటలో ఘటన

గండిపేట, వెలుగు: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఓ యువకుడిని తోటి స్నేహితులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కోకాపేట డబుల్‌‌బెడ్‌‌రూమ్స్‌‌ ప్రాంతంలో కాశారం యాదగిరి(24) తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. 

మంగళవారం తెల్లవారుజాము వరకు స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో యాదగిరిని తోటి స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.