వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. వాల్మీకి బోయలతో పాటుగా బేదర, కిరాతక, నిషాది, పెద్ద బోయ,  బాట్‌ మదురాలు, చామర్ మదురాలను ఎస్టీలో చేర్చాలని గతంలో కేంద్రానికి లేఖ రాశామని సీఎం చెప్పారు. దీనిపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదన్న సీఎం..  కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మాలి వర్గాన్ని కూడా  ఎస్టీ జాబితాలో కలపాలని సీఎం కోరారు. ఆసిఫాబాద్ తో పాటు ఆదివాసీ జిల్లాల్లో నివసిస్తున్న మాదిగలను సైతం ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదనలు పరిశీలిస్తామని చెప్పారు.