ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రవేశంపై నెలకొన్న జాప్యం, నిబంధనల వివాదంపై మస్క్ చేసిన విమర్శలకు వెంకటేష్ ప్రసాద్ గట్టిగానే బదులిచ్చారు ఎక్స్ వేదికగా. అమెరికాలో చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD ఎంట్రీని అడ్డుకోవడానికి మస్క్ స్వయంగా ప్రయత్నించారని ఆరోపిస్తూ విరుచుకుపడ్డారు.
భారత్‌లో స్టార్‌లింక్ లాంచ్‌ను నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారంటూ ఎలాన్ మస్క్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంబానీని 'ప్రధానమంత్రి అంబానీ' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో టెలికాం రంగ దిగ్గజాల ఒత్తిడి వల్లే తమకు అనుమతులు రావట్లేదని మస్క్ పరోక్షంగా ఆరోపించారు. అయితే ఎలాంటి వ్యాపార సంస్థలు కూడా నిబంధనలను అడ్డుకోవట్లేదని, జాతీయ భద్రత, ప్రభుత్వ రెగ్యులేటరీ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని భారతీయ అధికారులు స్పష్టం చేశారు.
Extremely poor from President Musk, who ensured BYD didn’t enter the US for fear of his Tesla sales crumbling . And here making an issue out of our right for national security. A great entrepreneur but a v bitter man. Earlier went after Trump claiming his name is in Epstein files only to calm down later to ensure his business doesn’t suffer. Lol Musk.
— Venkatesh Prasad (@venkateshprasad) October 10, 2026
ఈ వివాదంలో ఎలాన్ మస్క్‌పై మండిపడిన వెంకటేష్ ప్రసాద్.. ఆయనది ద్వంద్వ వైఖరని విమర్శించారు. అమెరికా మార్కెట్‌లో తన టెస్లా కార్ల అమ్మకాలు పడిపోతాయనే భయంతోనే చైనా కంపెనీ బీవైడీ ఎంట్రీని అడ్డుకున్నారని ప్రసాద్ ఆరోపించారు. అమెరికాలో తన వ్యాపార ప్రయోజనాల కోసం అలా వ్యవహరించి.. మరోవైపు భారత్ తన జాతీయ భద్రత గురించి మాట్లాడుతుంటే దానిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఎలాన్ మస్క్ గొప్ప వ్యాపారవేత్త కావచ్చు కానీ.. వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్ పడిన విభేదాలను, ఆ తర్వాత తన వ్యాపారాల కోసం తన వైఖరిని మార్చుకున్న వైనాన్ని ప్రసాద్ గుర్తుచేశారు. భారత్‌లో ఫెయిర్ కాంపిటీషన్ గురించి మాట్లాడే మస్క్.. ఇతర దేశాల మార్కెట్లలో తన ప్రత్యర్థులను అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం టెలికాం రంగంలో స్టార్‌లింక్ ప్రవేశం, మస్క్ వ్యాఖ్యలు, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ విమర్శలు దేశవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. మస్క్ తన సొంత దేశంలో ఒకలా ఇతర దేశాల్లో మరోలా వ్యవహరించటంపై సర్వత్రా వ్యతిరేకతకు దారితీస్తోంది.
