కరోనా బాధితుల వార్డ్ లో మూడురోజులు : అయినా 35మందికి సోకని కరోనా వైరస్

కరోనా బాధితుల వార్డ్ లో మూడురోజులు : అయినా 35మందికి సోకని కరోనా వైరస్

35మందికి కరోనా సోకలేదు. అయినా కరోనా సోకిందంటూ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు రిపోర్ట్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇండియా.కామ్ కథనం ప్రకారం ఢిల్లీ నోయిడాకు చెందిన 35మందికి తేలికపాటి జ్వరం, దగ్గు లక్షణాలు ఉండడంతో అత్యవసర చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల్ని సంప్రదించారు. బాధితులకు టెస్ట్ లు నిర్వహించిన డాక్టర్లు కరోనా వైరస్ సోకిందంటూ బాంబు పేల్చారు. దీంతో భయాందోళనకు గురైన ఆ 35మంది రిపోర్ట్ లు తీసుకొని ప్రభుత్వాసుపత్రి కరోనా వైరస్ బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఐసోలేషన్ వార్డ్ లో చేరారు. అదే క్రమంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు 35మంది బాధితుల నమూనాల్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు తరలించారు. మూడు రోజుల తరువాత టెస్ట్ ల్ని పరీక్షించగా అందులో ఆ 35మందికి కరోనా సోకలేదని డాక్టర్లు నిర్ధారించారు.

కరోనా నెగిటీవ్ రావడంతో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన  ప్రైవేట్ ఆస్పత్రిపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా కరోనా వైరస్ బాధితుల వార్డ్ లో మూడు రోజుల పాటు కలిసి ఉన్నా కరోనా సోకక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.