GHMC సెక్షన్ ఆఫీసర్పై దాడి..బీజేపీ కార్పొరేటర్పై కేసు

GHMC సెక్షన్ ఆఫీసర్పై దాడి..బీజేపీ కార్పొరేటర్పై కేసు

హైదరాబాద్ నగరంలోని జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపై భౌతిక దాడి చేశారంటూ GHMC  సర్కిల్ 14 సెక్షన్  ఆఫీసర్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ ముందే సెక్షన్ ఆఫీసర్ నరేష్ పై దాడి చేశారు బీజేపీ కార్పొరేటర్. దీంతో విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు జీహెచ్ ఎంసీ ఉద్యోగులు. 

Also Read: రాంగ్​ రూట్లో వెళ్తే వెహికల్​ ఫోటో తీసి పంపండి

తమపై దౌర్జన్యంగా దాడిచేసిన జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై అబిడ్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారులపై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదీశారు. కార్పొరేటర్ జైష్వాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.