
న్యూఢిల్లీ: యూనివర్సల్ బ్యాంక్‌గా మారడానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయంగా మొదటిసారి ఆమోదం పొందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దేశవ్యాప్తంగా 51 కొత్త బ్రాంచులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మనదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ బ్రాంచులు ఆగస్టు 15న మొదలవుతాయి.
వీటిలో 30 లయబిలిటీ బ్రాంచులు 21 మైక్రోఫైనాన్స్, ఇంక్లూజివ్ బ్యాంకింగ్ బ్రాంచులు ఉన్నాయి. వీటిని పశ్చిమ బెంగాల్, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు లాంటి చోట్ల ఏర్పాటు చేశారు.