బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 4-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచి ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. చివరి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 122 రన్స్ చేసింది. చేజింగ్ కు దిగిన ఆసీస్ 62 పరుగలకే ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు టీ20లో ఇదే అత్యల్ప స్కోరు. ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హసన్ చెలరేగడంతో బంపర్ విక్టరీ కొట్టింది బంగ్లాదేశ్. షకీబ్ 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. టీ20ల్లో 100 వికెట్లతో పాటు వెయ్యి పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు షకీబ్.

