India vs Australia: 2027 వన్డే ప్రపంచకప్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సన్నాహాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) దృష్టి మాత్రం భారత్‌లో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) పైనే ఉంది. రాబోయే సెప్టెంబర్‌లో జింబాబ్వే, సౌతాఫ్రికా పర్యటనల తర్వాత వన్డే వరల్డ్ కప్‌నకు సిద్ధం కావాల్సి ఉన్నా, అదే సమయంలో భారత్‌లో జరిగే ఆస్ట్రేలియా ఎ' (Australia A) టూర్ కే అగ్రశ్రేణి ఆటగాళ్లను పంపాలని ఆసీస్ సెలెక్టర్లు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియాకు BGT ఎందుకంత ముఖ్యం:
ఆస్ట్రేలియా స్వదేశంలో 2024–25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నప్పటికీ, భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి ఏకంగా 22 ఏళ్లు (2004-05 తర్వాత) దాటిపోయింది. యాషెస్ సిరీస్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియాకు బీజీటీనే అతిపెద్ద సవాలుగా మారింది. 2027 జనవరి 21 నుంచి మార్చి 3 వరకు భారత్, ఆస్ట్రేలియాల మధ్య 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే భారత పిచ్‌లపై ఆడి సవాలు ఎదుర్కొనేలా యువ ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధం చేస్తుంది.
వరల్డ్ కప్ కంటే భారత్‌లో టెస్టు సిరీసే ప్రాధాన్యం:
ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ..కొందరు ఆటగాళ్లు జింబాబ్వే, సౌతాఫ్రికా వైట్-బాల్ సిరీస్‌లో ఆడి, ఆ తర్వాత ఇండియా 'ఎ' పర్యటనలో చేరవచ్చు. అయితే కొందరికి మాత్రం కచ్చితంగా భారత్ పర్యటనకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం.. ఇండియా ఉపఖండ పరిస్థితులలో నిలకడగా ఆడే అనుభవం యువ ఆటగాళ్లకు చాలా అవసరమని వెల్లడించాడు.
ALSO READ : ఐపీఎల్ 2027 ముందు ఢిల్లీ మాస్టర్ ప్లాన్..
టెస్టు జట్టులో యంగ్ బ్లడ్‌పై దృష్టి:
ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టు సగటు వయసు 33 ఏళ్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. వయసు పైబడుతున్న సీనియర్ల స్థానంలో కొత్త రక్తాన్ని నింపేందుకు ఆస్ట్రేలియా ఎ పర్యటనను ఉపయోగించుకోవాలని ఆసీస్ బోర్డు భావిస్తోంది. కూపర్ కానలీ, జేవియర్ బార్ట్‌లెట్, ఆలీ పీక్ వంటి ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ రేసుతో పాటు ఇండియా 'ఎ' టూర్ లోనూ భాగమయ్యే అవకాశం ఉంది. సామ్ కాన్స్టాస్, కాంప్‌బెల్ కెల్లావే, నాథన్ మెక్‌స్వీనీ, కోరీ రోచిసియోలి, ఫెర్గస్ ఓ నీల్ లాంటి యువ ప్రతిభావంతులను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం రెడీ చేస్తున్నారు.
