బిస్బేన్: బాబర్‌ఆజమ్(104) సెంచరీతో ఆకట్టుకున్నా.. మహమ్మద్‌రిజ్వాన్ (95) ధాటిగా పోరాడినా.. స్పిన్నర్‌యాసిర్‌షా (42) కెరీర్‌బెస్ట్‌స్కోరుతో మెప్పించినా.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ఇన్నింగ్స్‌ఐదు పరుగుల తేడాతో గ్రాండ్‌విక్టరీ సాధించింది. ప్రత్యర్థికి 340 పరుగుల ఆధిక్యం ఇచ్చుకున్న పాక్‌రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినా ఫలితం లేకపోయింది. శనివారం సెకండ్‌సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయి ఓవర్‌నైట్‌స్కోరు 64/3తో నాలుగో రోజైన ఆదివారం ఆట కొనసాగించిన పాక్‌సెకండ్‌ఇన్నింగ్స్‌లో 335 రన్స్‌కు ఆలౌటై చిత్తుగా ఓడింది. ఆట మొదలైన కొద్దిసేపటికే షాన్‌మసూద్(42)తో పాటు ఇఫ్తికర్‌అహ్మద్(0) ఔటవడంతో ఆ జట్టు94/5తో చిక్కుల్లో పడింది. కానీ, ఓవర్‌నైట్‌బ్యాట్స్‌మన్‌బాబర్‌ఆజమ్, రిజ్వాన్‌ఆరో వికెట్‌కు 132 రన్స్‌జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఆజమ్‌వెనుదిరిగినా.. యాసిర్‌షా సహకారంతో రిజ్వాన్‌పోరాటం కొనసాగించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 79 రన్స్‌జోడించడంతో ఆట ఐదో రోజుకు చేరేలా కనిపించింది. కానీ, హాజిల్‌వుడ్‌తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరితో పాటు షాహీన్‌షా ఆఫ్రిది (10) వికెట్ తీయడంతో ఫైనల్‌సెషన్‌చివరలో ఆసీస్‌విజయం అందుకుంది. హేజిల్‌వుడ్‌నాలుగు వికెట్లు తీయగా, మిచెల్‌స్టార్క్‌మూడు, కమిన్స్‌రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్240 రన్స్‌కు ఆలౌటవగా.. ఆసీస్580 రన్స్‌చేసిన సంగతి తెలిసిందే. హోమ్‌టీమ్‌తరఫున భారీ సెంచరీ చేసిన లబుషేన్‌మ్యాన్‌ఆఫ్‌ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఇరు జట్ల మధ్య సెకండ్‌టెస్ట్‌ఈ నెల 29న మొదలవనుంది.

