పెండింగ్ పనులపై దృష్టి పెట్టిన అధికారులు

పెండింగ్ పనులపై దృష్టి పెట్టిన అధికారులు

నిన్నమొన్నటి దాకా ఎన్నికల విధుల్లో బిజీబిజీగా ఉన్న జిల్లా యంత్రాంగం ప్రస్తుతం పథకాలు, పెండింగ్ పనుల పరిష్కారం కోసం పరుగులు పెడుతోంది. హైదరాబాద్ ను మినహాయిస్తే ఇతర జిల్లాల్లో స్థానిక ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఎలక్షన్ కోడ్ ఇంకా అమలులో ఉంది. దీంతో జిల్లాల్లో పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ జిల్లాకు స్థానిక ఎన్నికలు లేకపోవడంతో పథకాల అమలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించడంపై కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ దృష్టి పెట్టారు.

జాయింట్ కలెక్టర్ గుగులోతు రవి, జిల్లా రెవెన్యూఅధికారి భూపాల్ రెడ్డి , హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి , రాజా గౌడ్, 16 మండలాల తహసీల్దార్లతోపాటు కలెక్టరే ట్ వర్గాలతో ప్రత్యకేంగా భేటీ అవుతున్నారు. పలు పథకాల కోసం అందిన దరఖాస్తులు, ఇతర సమస్యలపై ఎప్పటి కప్పుడు స్పందించా లని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఆసరా పింఛన్లకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వెంటనే పరిష్కరించేలా చూడాలని కిందస్థాయి అధికారులకు సూచిస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా ఉన్న కోర్టు కేసులకు సంబంధించి కౌంటర్ ఫైల్స్ దాఖలుకు తహసీల్దార్లు సిద్ధమవుతున్నారు. ఈముల పెండింగ్ కేసుల విషయంలో రెవెన్యూ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించేందుకు అంత సిద్ధమవుతున్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

ఇప్పటికే ప్రజావాణిలో స్వీకరించిన 87 పెం డింగ్ ఫిర్యాదుల్లో జిల్లా అధికారుల వద్ద 37 వరకు ఉన్నట్టు సమాచారం. రెవెన్యూఅధికారుల వద్ద 50 పెం డింగ్ లో ఉన్నట్టు తెలిసింది. వాటిని పరిశీలించి త్వరలోనే పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఫిర్యాదుల రిపోర్టును అప్ లోడ్ చేయనున్నారు. కొద్ది రోజుల్లోనే పథకాలు, పెండింగ్ పనులు, ఫిర్యాదులను పరిష్కరించి ఆయా నివేదికలను కలెక్టర్ కు అందజేసేందుకు యంత్రాంగం రెడీ అవుతోంది.