నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..

నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..

హైదరాబాద్ లో చడ్డీ గ్యాంగ్ సృష్టించిన కలకలం గురించి మరువక ముందే నగరంలో మరో గ్యాంగ్ పుట్టుకొచ్చింది. చడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడిదార్ గ్యాంగ్ తయారయ్యింది. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జెక్ కాలనీలోని ఓ ఫ్లాట్ లో చొరబడి 4తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్ దోచుకున్నారు చడ్డీ గ్యాంగ్. వివరాల్లోకి వెళితే జెక్ కాలనిలో నివాసం ఉండే కే వెంకట్రావు అనే ప్రైవేట్ ఉద్యోగి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్ళాడు. 

శనివారం వెంకట్రావు పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తాళం పగలకొట్టి ఉండటం గమనించింది.ఈ ఘటన తెలుసుకున్న వెంకట్రావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వెంకట్రావు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా చుడిదార్ గ్యాంగ్ పనిగా గుర్తించారు. ప్రస్తుతం చుడిదార్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.