అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కమిటీ

అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కమిటీ

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలని మంత్రివర్గం నిర్ణయించిందని  తెలిపారు  మంత్రి శ్రీధర్‌బాబు. పాఠశాలల ఆధునీకరణకు సుమారు రూ.600 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.  మే 20వ తేదీ సోమవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా మంత్రవర్గం ప్రధానంగా విద్యపై చర్చించినట్లు తెలుస్తోంది. అమ్మ ఆదర్శపాఠశాల పనులపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ వేసింది. 

సమావేశం అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ..  వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాల అమలు మా ప్రభుత్వ ప్రధాన్యతలని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావాలని  నిర్ణయించినట్లు తెలిపారు.  క్వాలిటీ, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంతో విద్యారంగంలో మార్పులు తెస్తామని చెప్పారు. అమ్మ  పాఠశాలల కమిటీతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేస్తామని తెలిపారు.