Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..

Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు వీడియో సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికలలో నిబంధనలకు విరుద్ధంగా ఆ యువకుడు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు. ఒకసారి కాదు, ఏకంగా 8 సార్లు ఓటేశాడు. అంతేగాక, తాను బీజేపీకి ఓటు వేస్తూ వీడియోలు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతోపాటు పలు రాజకీయ పార్టీలు ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ వీడియోలో యువకుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ (ఈవీఎంల)లో ఓటు వేస్తున్నాడు. ఓటు వేస్తుండగా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. కాగా.. ఇది నాలుగో దశ పోలింగ్ లో జరిగింది. .కొద్దిసేపటి తర్వాత.. యువకుడు మళ్లీ క్యూబికల్‌లో ఉన్నాడు, అంతేకాకుండా కెమెరాలో చూపిస్తూ ఇది నంబర్ 2 అని చెప్పాడు. మరో రౌండ్ ఓటింగ్ తర్వాత, ఇది మూడోది అని చెప్పాడు.ఈ విధంగా యువకుడు ఎనిమిది సార్లు ఓటు వేయడం వీడియోలో రికార్డ్ చేశాడు. అయితే.. అతను చూపిస్తున్న వీడియోలో ఒక్కోదానిలో ఒక చొక్కాలో కనిపించాడు. 

మే 13న యూపీలోని ఫరూఖాబాద్ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్ పేరు పక్కన ఉన్న బటన్‌పై నొక్కాడు. ఓటేసిన ప్రతిసారి ఆ యువకుడు చేతి వేళ్లతో లెక్కపెడుతూ సంకేతాన్ని చూపడం వీడియోలో కనిపిస్తున్నది.దొంగ ఓటు వేసిన వ్యక్తి రంజన్ సింగ్ అని.. అతడి తండ్రి బీజేపీ నేత అనిల్ సింగ్‌గా గుర్తించారు.  కాగా.. ఈ ఘటనలో యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. ఆ పోలింగ్ బూత్ లో ఉన్న పోలింగ్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తామని, పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్‌కు సిఫార్సు చేశామని యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా తెలిపారు.   అయితే ఆ యువకుడు .. ఎనిమిది సార్లు ఓటు వేసినట్లు అంగీకరించాడని సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ సింగ్ కుష్వాహా ఓ వార్తా సంస్థకి తెలిపారు.

మరోవైపు.. ఈ వైరల్ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒత్తిడి చేసి ప్రజాస్వామ్యాన్ని దోచుకోవాలని చూస్తోంది అని ఆరోపించారు. 

మరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఎక్స్‌లో వీడియోను షేర్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి. లేదంటే, బీజేపీ బూత్ కమిటీ లూట్ కమిటీ అనే పోస్ట్‌ చేశారు.ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగించేలా జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. . ఇది మేల్కోవాల్సిన సమయమని కాంగ్రెస్‌ పేర్కొన్నది.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తమకు కావాల్సిన అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఓటు వేయవచ్చు. అంతేగాక, పోలింగ్ బూత్‌లోకి ఫోన్‌లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతిలేదు. ఇవన్ని నిబంధనలు ఉల్లంఘించి ఆ యువకుడు 8 సార్లు ఎలా ఓటేశారంటూ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.