రేపు (సెప్టెంబర్ 2) .. హైదరాబాద్లో 11వేల700 డబుల్ ఇండ్ల పంపిణీ

రేపు (సెప్టెంబర్ 2) ..  హైదరాబాద్లో 11వేల700 డబుల్ ఇండ్ల పంపిణీ
  • 9 ప్రాంతాల్లో లాటరీ ద్వారా కేటాయింపు
  • మంత్రులు, మేయర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ

సికింద్రాబాద్, వెలుగు : బల్దియా పరిధిలో ఒకే రోజు 11,700  డబుల్ ఇండ్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీటిని శనివారం 24 సెగ్మెంట్లలోని 9 ప్రాంతాల్లో మంత్రులు, డిప్యూటీ స్పీకర్, మేయర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ఒక్కో  నియోజకవర్గం నుంచి 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు.  

బహదూర్​పల్లిలో మంత్రి కేటీఆర్

కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ పరిధి బహదూర్ పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో గాజుల రామారం, బహదూర్​పల్లి, డి.-పోచంపల్లికి చెందిన మొత్తం 1,700 ఇండ్లను మంత్రి కేటీఆర్​ లాటరీ ద్వారా లబ్ధిదారులకు అందిస్తారు.  గాజులరామారంలో144,  బహదూర్​పల్లిలో 356 ఇండ్లను కుత్బుల్లాపూర్ పరిధి లబ్ధిదారులకు..  డి-. పోచంపల్లిలోని 1200 ఇండ్లను సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 200 మందికి, సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మందికి అందిస్తారు. 

మంఖాల్​లో..  

మంఖాల్-–-1 లొకేషన్​లో 2,230 ఇండ్లను లబ్ధిదారులకు మంత్రి సబితారెడ్డి పంపిణీ చేస్తారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు మంఖాల్--–1లో  నిర్మించిన 500 ఇండ్లను, మంఖాల్ –--2 లో నిర్మించిన 1,730 ఇండ్లను మలక్ పేట్ నియోజకవర్గానికి చెందిన 50 మందికి, యాకత్ పురా నియోజకవర్గానికి చెందిన 500 మందికి,  చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన 230 మంది లబ్ధిదారులకు అందజేస్తారు. 

బండ్లగూడలో..  

చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వే నెం.82, 83/పి ప్రాంతంలో,  బహదూర్​పురా నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్​నగర్​లో  నిర్మించిన 770 ఇండ్లను హోంమంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందినవారికి బండ్లగూడలో నిర్మించిన 270 ఇండ్లను, ఫరూఖ్​నగర్​లో నిర్మించిన 500 ఇండ్లను బహదూర్ పురా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 

నార్సింగిలో.. 

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగి, బైరాగిగూడ- –2 ప్రాంతాల్లో నిర్మించిన 356 ఇండ్లను నార్సింగి సర్వే నెం.117  ప్రాంతంలో నిర్మించిన 356 ఇండ్లను మంత్రి మహేందర్​ రెడ్డి పంపిణీ చేస్తారు. నార్సింగి సర్వే నం.117 లో నిర్మించిన 196, బైరాగి గూడ-–2 లో నిర్మించిన 160 ఇండ్ల చొప్పున లబ్ధిదారులకు అందజేస్తారు. 

శేరిలింగంపల్లిలో ..   

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల సర్వే నెం.125 లోని సాయి నగర్, హఫీజ్ పేట్, నల్లగండ్ల కాలనీలోని 344 ఇండ్లను ,అందులో నల్లగండ్ల సర్వే నెం. 125 కాలనీకి చెందిన 216, సాయినగర్ హఫీజ్ పేట్ కు చెందిన 168 ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ లబ్ధిదారు
లకు పంపిణీ చేస్తారు. 

కొల్లూరులో..

పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూరు- –-1 ప్రాంతంలో 3,300 ఇండ్లను మంత్రి హరీశ్​ రావు అందజేస్తారు. కొల్లూరు--–1 కాలనీకి చెందిన 1500, ఖైరతాబాద్  200, జూబ్లీహిల్స్ 500, శేరిలింగంపల్లి 156, రాజేంద్రనగర్ 144, పటాన్ చెరు 500, అమీన్ పూర్-–2 లో నిర్మించిన 1800, గోషామహల్ కు 500, నాంపల్లి 500, కార్వాన్ 500, ఖైరతాబాద్ 300 ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. 

అహ్మద్ గూడలో..  

మేడ్చల్ సెగ్మెంట్​లోని అహ్మద్ గూడలో మంత్రి మల్లారెడ్డి1,500 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. వీటిల్లో లో మల్కాజ్ గిరి 500, ముషీరాబాద్ 500, సికింద్రాబాద్ నుంచి 500 మంది లబ్ధిదారులున్నారు. 

ఉప్పల్​లో..   

ఉప్పల్ సెగ్మెంట్​ పరిధి శ్రీనగర్ కాలనీలో నిర్మించిన 500 ఇండ్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  లబ్ధిదారులకు అందజేస్తారు. 

 ప్రతాప సింగారంలో.. 

మేడ్చల్ సెగ్మెంట్​ పరిధి ప్రతాప్ సింగారంలో వెయ్యి ఇండ్లను.. ఎల్ బీనగర్ సెగ్మెంట్​కు చెందిన 500 మందికి, అంబర్ పేట్ సెగ్మెంట్​కు  చెందిన 500 మంది లబ్ధిదారులకు డిప్యూటీ స్పీకర్​ పద్మారావుగౌడ్​ కేటాయింపు చేస్తారు.