
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి సజ్జనార్ మహారాష్ట్రకు వెళుతుండగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో సజ్జనార్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కరీంనగర్ కు తరలించారు. రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సజ్జనార్ కుడి చేతి వేలుకు స్వల్ప గాయం అయ్యింది. ప్రథమ చికిత్స అనంతరం యథావిధిగా మహారాష్ట్రకు వెళ్లారు.