హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సమాచారా, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో ‘వెలుగు‘ ఫోటో జర్నలిస్ట్ దుబ్బాక సురేశ్ రెడ్డికి అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పాలపిట్ట ఒక పురుగును పట్టుకుని ఎగురుతూ తినే క్రమంలో నోటి ద్వారా పురుగును ఎగరేసి తినే ఫోటో తీసినందుకు సురేష్ రెడ్డికి ఈ అవార్డు లభించింది.

