మీ సాయం కోసం మేమున్నాం.. మాకు కాల్ చేయండి

మీ సాయం కోసం మేమున్నాం.. మాకు కాల్ చేయండి
  • ఆపదలో ఉన్నవారు పిలిస్తే స్పందించు..తక్షణ సాయం అందించు
  • మహబూబ్ నగర్ జిల్లాలో డయల్ 100 పై అవగాహన సదస్సు

మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలల్లో శాంతి భద్రతలకు సంబంధించి అవగాహాన సదస్సు నిర్వహించారు జిల్లా బ్లూ కోల్ట్స్ బృందాలు(mobile Quick reaction team). జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి గారి ఆదేశాల మేరకు నేడు జిల్లావ్యాప్తంగా పలు స్కూళ్లని, కాలేజీలను సందర్శించారు. శాంతిభద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏర్పడినా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి 100 నెంబర్ కు ఫోన్ చెయ్యాలని  విద్యార్ధినులకు సూచించారు.

గ్రామీణ ప్రాంత ప్రజలతోనూ చిన్నపాటి సమావేశాలు నిర్వహిస్తూ, వారితో స్నేహపూర్వక చర్చలతో పాటుగా డయల్ 100 నెంబర్ గురించి అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుండి పలు గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు బృందాలు వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలిగినా.. పోలీసుల సాయం కోరాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రజలు, గురుకుల, కస్తూర్బా పాఠశాలలో గొప్ప కదలికను తెచ్చాయని పలువురు చర్చించుకున్నారు.  ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన.. ఎస్.పి.రెమా రాజేశ్వరి గారికి, పోలీసు సిబ్బందికి ప్రజలు, విద్యార్థి లోకం ధన్యవాదాలు తెలిపారు.

Awareness seminar on Dial 100 at various schools and colleges in Mahabubnagar district