Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ డేరింగ్ డెసిషన్!

Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ డేరింగ్ డెసిషన్!

బేబీ మూవీతో వైష్ణవి యాక్టింగ్కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీగా మారబోతుందనే న్యూస్ కూడా వైరల్ అయింది.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది కూడా హీరోయిన్ గా అనుకుంటే..పొరపాటే!

అసలు విషయం ఏంటంటే..ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ఒక స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ఒప్పేసుకుందట. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram pothineni) హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతోందని టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ మూవీలో రామ్ ఎనర్జీకు మ్యాచ్ అయ్యే క్వాలిటీస్ వైష్ణవికి పుష్కలంగా ఉండటంతో..సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఐటమ్ సాంగ్‌లో చేసేందుకు మాత్రమే చాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

అందం..అభినయం..నటన ఉన్నతెలుగు హీరోయిన్ని ఐటమ్ సాంగ్లో ఊహించుకోవడానికి ఫ్యాన్స్ రెడీగా లేరు. నిజం చెప్పాలంటే ఇటువంటి సాంగ్‌లో చేయాలనే నిర్ణయాన్ని బేబీ వైష్ణవి తీసుకోలేదట. తన ఫస్ట్ మూవీ బేబీ కి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సాయిరాజేశ్ దగ్గరుండి..మాట్లాడి మరీ ఒప్పించి సైన్ చేయించాడనే న్యూస్ వినిపిస్తోంది.

కానీ,బేబీ బ్యూటీ ఇటువంటి స్పెషల్ సాంగ్ చేయడం అంటే..కత్తి మీద సాములాంటిదే. హిట్ అయితే, పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్లా ఫేమస్ అవ్వాలి. లేదంటే, ఇక ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదగడం కష్టమే అంటున్నారు సినీ క్రిటిక్స్. 

రామ్ అండ్ పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఇస్మార్ట్ శంకర్ ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.   బ్లాక్ బస్టర్ సినిమాను సీక్వెల్గా వస్తున్న డబల్ ఇస్మార్ట్  ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే 2024 మార్చ్ 8వరకు ఆగాల్సిందే.