నార్మల్ ​డెలివరీలో 5 కేజీల బరువున్న పాప

నార్మల్ ​డెలివరీలో 5 కేజీల బరువున్న పాప

అయిజ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో నార్మల్​డెలివరీలో 5 కేజీల బరువుతో పాప జన్మించింది. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన సుజాతకు పురిటి నొప్పులు మొదలవ్వడంతో కుటుంబ సభ్యులు గురువారం రాత్రి 11గంటల టైంలో అయిజలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. డాక్టర్​ అందుబాటులో లేకపోడంతో డ్యూటీలో ఉన్న స్టాఫ్​నర్స్ జ్యోతి.. సుజాతకు నార్మల్​డెలివరీ చేసింది. 5కిలోల బరువుతో పాప జన్మించింది. శుక్రవారం ఉదయం పీహెచ్​సీ డాక్టర్​ స్వరూపారాణి మాట్లాడుతూ.. సాధారణంగా పిల్లలు 2.5 నుంచి 3కిలోల బరువుతో పుడతారని, నార్మల్ డెలివరీలో 5కిలోల బరువుతో పుట్టడం అరుదు అని చెప్పారు. ఇన్​టైంలో డెలివరీ చేసిన స్టాఫ్​నర్సును అభినందించారు. సుజాతకు ఇది మూడో కాన్పు కాగా మొదటి రెండు కాన్పుల్లోనూ ఆడ పిల్లలే పుట్టారు.