బాడీగార్డ్పై బాలయ్య మస్త్ గరం

బాడీగార్డ్పై బాలయ్య మస్త్ గరం

బాలకృష్ణ తన అభిమానులపై చికాకు పడటం, చెయ్ చేసుకున్న సందర్భాలు చాలానే చూశాం. వేదికతో సంబంధం లేకుండా బాలయ్య చేసే కామెంట్స్ ఒక్కోసారి వైరల్ అవుతాయి. అయితే వీటిని తన అభిమానులు పెద్దగా పట్టించుకోరు. తన అభిమాన హీరో ప్రేమతో చేశారని లైట్ తీసుకుంటారు.

లేటెస్ట్ గా నిన్న ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ స్టేజ్ పై తన బాడీగార్డ్ పై సీరియస్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణకు గజమాల వేయడానికి స్టేజ్ పై అభిమానులు ఒక్కసారిగా  గుమిగూడారు. దీంతో తన బాడీగార్డ్ అభిమానులను అడ్డుకునే  ప్రయత్నం చేయగా.. బాలయ్య తన బాడీగార్డ్ ను చేతితో నెట్టేసి, దాదాపు కొట్టినంత పనిచేశాడు. 

అంతకుముందు  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన బాలకృష్ణకు శాలువా కప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఓ అభిమానిపై  బాలయ్య చికాకు పడ్డారు. తన నెత్తిపై ఉన్న కళ్లజోడు కింద పడేసరికి అభిమానిపై గుస్సా అయ్యాడు. తర్వాత  సైలెంట్ అయ్యాడు.