
ఏదో సాధించాలనే తపన ఆయనను ఉన్నత చదువుల వైపు అడుగులు వేయించింది. ఆర్థికపరిస్థితులను అధిగమించే శక్తినిచ్చింది. చదువు కోసం కూలికి పోయిండు. పేదరికంలో ఇబ్బందులుఎదుర్కొన్నాడు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాడు. దుర్భర పేదరికం అనుభవించిన బలరాం సింగరేణి కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించే స్థాయికి ఎదిగిండు.
“నా బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లే. కానీఎప్పుడూ బాధపడలేదు. గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తానంటే బంధువులు వెటకారంగా మాట్లాడేవారు. కలెక్టర్ స్థాయికి ఎదగడమే నా లక్ష్యంగా ఉండేది. అయితే సివిల్స్‌లో ఐఆర్‌ఎస్ పాసై ఆ కలను నెరవేర్చుకున్నా. మాది మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‍లోని తిరుమలగిరి. తల్లిదండ్రులు హూన్య, కేస్లీ.ఏడుగురు సంతానం. అందులో పెద్దవాడ్ని.మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది.కానీ నీటి కొరత. అందుకే అమ్మానాన్నహైదరాబాద్ లో కూలీ పనిచేసేవాళ్లు. దాంతో నానమ్మ దగ్గర పెరిగా. ప్రభుత్వబడిలోనే చదువుకున్నా. అయినా చదువులోముందుండేవాడ్ని. కుటుంబ ఆర్థిక పరిస్థితులు నాపై బాగా ప్రభావం చూపాయి.అందుకే ఏమాత్రం సెలవు దొరికినా కూలీ పనికెళ్లేవాడ్ని. అప్పట్లో రోజంతా కష్టపడితే ఇరవై ఐదు రూపాయలు వచ్చేవి. దాంతోనే నా అవసరాలు తీర్చుకునేవాడ్ని.తల్లిదండ్రులకు భారం కావొద్దనే కూలీపనికెళ్లా. వేసవి సెలవుల్లో తోటి స్నే హితులుకాలక్షేపం చేస్తే, నాకు కూలీ పనులతోనే రోజు గడిచేది.
స్నేహితుల సాయంతో..
ఇంటర్లో ఉండగానే శారదతో వివాహమైంది. అటు కుటుంబం, ఇటుసంసార బాధ్యతల కారణంగా ఉన్నతచదువులు భారమయ్యాయి. హైదరాబాద్ ఓయూ యూనివర్సిటీ చూశాక చదువుపై మరింత ఆసక్తి పెరిగింది.దూరవిద్యలో డిగ్రీ, పీజీ పూర్తి చేశా. సివిల్స్ సాధించాలనే పట్టుదల పెరిగింది. అద్దెకట్టలేని స్థితిలో స్నేహితుల గదుల్లో ఉండిచదువుకున్నా. చిన్నప్పట్నించి చదువులోముందుండేవాడ్ని. యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యా. ఆ తర్వాత గ్రూప్ 1, 2 అర్హతసాధించా. సీబీఐ ఎగ్జిక్యూటివ్ అధికారిగాపనిచేశా. అయినా సివిల్స్ లక్ష్యంగా కష్టపడ్డా . 2010 సివిల్స్‌కు ఎంపికయ్యా. ఢిల్లీలో శిక్షణ పూర్తి అయిన తర్వాత మేడ్చల్ లో సెంట్రల్ కస్టమ్స్ డివిజన్ అధికారిగా విధులు నిర్వహించా.
రాజీపడలేదు..
కొన్నాళ్లు ముంబై డిప్యూటీ కమిషనర్‍గా పనిచేశా. పెద్ద పెద్ద కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేవి. అందులో పదిహేను వందలవరకు కంపెనీలు ఉన్నాయి. వాటన్నింటికి నోటీసులు పంపి నూట యాభై కోట్లువసూలు చేశా. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కంటైనర్లపై కేసులు పెట్టా. విధి నిర్వహణలో రాజీపడని తత్వం నాది. ఈ మధ్యనే సింగరేణి కాలరీస్ కంపెనీకి డైరెక్టర్ ఫైనాన్స్‌గా బాధ్యతలు చేపట్టా. కంపెనీ పరిస్థితులను అర్థం చేసుకుంటున్నా. సింగరేణిలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నా.’