పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాల్ టాంపరింగ్.. ఫఖర్ జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాల్ టాంపరింగ్.. ఫఖర్ జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్)లో బాల్ టాంపరింగ్ వివాదం కలకలం రేపుతోంది. ఆదివారం కరాచీ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాల్ ఆకారం మార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ క్రికెటర్, లాహోర్ ఖలందర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిషేధం విధించారు. లీగ్ నిబంధనల ప్రకారం అతను లెవల్-3 నేరానికి పాల్పడినట్లు తేలడంతో పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.

మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఈ శిక్ష ఖరారు చేసింది. కరాచీ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరులో రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్ ముగిసిన తర్వాత ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, లాహోర్ ఖలందర్స్  కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిది చర్చించుకుంటున్న సమయంలో అంపైర్ ఫైసల్ వాళ్ల వద్ద నుంచి  బాల్ తీసుకొని పరీక్షించాడు.

బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థితిని ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు గుర్తించిన అంపైర్లు.. లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విధించిన ఐదు పెనాల్టీ రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరాచీ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించడమే కాకుండా బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కూడా మార్చారు. దీంతో చివరి ఓవర్లో 14 రన్స్ చేయాల్సిన కరాచీ సమీకరణం 9 రన్స్‌‌గా మారింది. అబ్బాస్ ఆఫ్రిది ఫోర్, సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు.