ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే..ప్రతిపక్ష నాయకుడిని తీసుకొని అసెంబ్లీకి రావాలి : బల్మూరి వెంకట్

ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే..ప్రతిపక్ష  నాయకుడిని తీసుకొని అసెంబ్లీకి రావాలి : బల్మూరి వెంకట్
  •     కేటీఆర్‌‌‌‌కు బల్మూరి వెంకట్ సవాల్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌కు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడిని తీసుకుని అసెంబ్లీకి రావాలని విప్ బల్మూరి వెంకట్ సవాల్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను సరిగ్గా నిర్వహించలేని బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు ధర్నాలు చేసినా, మీటింగ్‌‌లు పెట్టినా జనాలు రావడం లేదని సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకున్నారంటే ఆ పార్టీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. 

ప్రజల్లో ఆదరణ పూర్తిగా తగ్గిపోవడం వల్లే బీఆర్ఎస్ నాయకుల్లో అసహనం పెరుగుతోందని విమర్శించారు. త్రీ ట్రిలియన్‌‌లో ఎన్ని సున్నాలు ఉంటాయో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పదేండ్ల అధికారంలో వేల కోట్ల దోపిడీకి పాల్పడటం వల్లే కేటీఆర్‌‌కు కోట్లు, మిలియన్లు, ట్రిలియన్ల లెక్కలు.. వాటి పక్కన ఉండే సున్నాలు బాగా అలవాటయ్యాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.