మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు : విప్ బల్మూరి వెంకట్

మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు :   విప్ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని విప్ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్రంలోని యువత గురించి రాంచందర్ రావు మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. యువతను చట్టసభలకు పంపించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. 

ఎమ్మెల్సీగా తనకు, రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ ను, మరో 20 మంది యువకులకు కార్పొరేషన్ పదవుల్లో రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. జెన్‌‌‌‌ జీ యువతను చట్టసభలకు పంపించేందుకు పోటీచేసే వయస్సు 21 ఏండ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి ఆలోచన చేస్తే...దాన్ని అభినందించాల్సిందిపోయి, విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇటీవల కేరళలో కొత్తగా ఏర్పడిన తమ కాంగ్రెస్  ప్రభుత్వంలో కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు.