ముషీరాబాద్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 22వ తేదీన నిర్వహించనున్న ఆలయ్ బలయ్కార్యక్రమానికి రావాలని గవర్నర్ శివ ప్రతాప్శుక్లాను హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
.అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్బండారు విజయ లక్ష్మి, గౌతమ్ రావు, నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు దసరాను పురస్కరించుకొని రాంనగర్ లోని ఆయన ఇంట్లో ఆయుధ పూజ నిర్వహించారు. తర్వాత అలయ్‌బలయ్ కి సంబంధించి నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి పాడిన పాటను ఆవిష్కరించారు.
