కరీంనగర్ కి మంచి రోజులొచ్చాయి... గెలిచిన 100 రోజుల్లోనే వందల కోట్ల నిధులు తెచ్చాం: బండి సంజయ్ 

కరీంనగర్ కి మంచి రోజులొచ్చాయి... గెలిచిన 100 రోజుల్లోనే వందల కోట్ల నిధులు తెచ్చాం: బండి సంజయ్ 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ( జులై 3 ) మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తాను గెలిచిన 100 రోజుల్లోనే ప్రధాని మోడీని కలిసి వందలాది కోట్ల నిధులు తెచ్చామని... కరీంనగర్ కు మంచి రోజులొచ్చాయని అన్నారు. 

డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.80 కోట్లు కేటాయించామని..కరీంనగర్  పార్లమెంట్ పరిధిలో 10 వేల కోట్లు నిధులు తెచ్చానని అన్నారు బండి సంజయ్.  దసరా వరకు వరంగల్ కరీంనగర్ హైవే ప్రారంభం అవుతుందని...మానేరుపై బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్నామని అన్నారు.

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పై మంత్రి పొన్నం కు అవగాహన లేదని...దేశంలోనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 17 ప్రాజెక్ట్ లే వచ్చాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ కి మాత్రమే ప్రతిపాదన పంపిందని...తాను కరీంనగర్ కి కూడా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తెచ్చానని అన్నారు. విబిజీ రాంజీ పై రాష్ట్రం ద్వంద్వ విధానం అవలంభిస్తోందని.. పథకం మంచిదే అంటూ కేసు వేస్తాం అంటున్నారని అన్నారు బండి సంజయ్.