దేశంలో ఇందిరా గాంధీ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అరాచకాలు చేస్తున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన.. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగానే కేసీఆర్ కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండి పడ్డారు.
కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన, వార్తలు రాసిన బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్న బండి సంజయ్… కాంగ్రెస్ పార్టీ కి బీజేపీ ఏ విధంగా గుణం పాఠం చెప్పిందో.. ప్రజలకు మద్దతుతో టిఆర్ఎస్ కు అలాగే గుణం పాఠం చెప్పాలన్నారు.
కేసీఆర్ అవినీతి, గడీల పాలన కు వ్యతిరేకంగా అందరూ భాగస్వాముల మై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అనే మూర్ఖుడు చేతిలో తెలంగాణ బందీ అయింది. తెలంగాణ అమర వీరుల ఆశయ నెరవేరడం లేదు. తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తుంది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించేలా ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

