మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

హైదరాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంపై బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.  అనుమతుల నుంచి ఫైర్ సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమన్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.