కేసీఆర్ తల ఎప్పుడు నరుక్కుంటాడో…

కేసీఆర్ తల ఎప్పుడు నరుక్కుంటాడో…

దళితుడిని సీఎం చేయకపోతే  తల నరుక్కుంటానన్న కేసీఆర్.. ఎప్పుడు నరుకుంటాడో చూడాలన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ . దళితులు చెప్పులు కుడుతారు ..వాళ్ళేం చేస్తారనుకుంటున్నారేమో.. వాళ్ళ చేతుల్లో చెప్పులే కాదు మొలలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వానికి మొలలు దింపే రోజులు వచ్చాయన్నారు.  దళితులను మోసం చేసేందుకు కెసీఆర్ మళ్ళ వస్తడని.. కెసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టాలన్నారు. కేసీఆర్ ఇచ్చే డబ్బులు తీసుకొని బీజేపికి ఓటు వేయాలన్నారు. MLC ఎన్నికల్లో మేధావులందరూ  బీజేపికి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారన్నారు.

దళితులే హిందూ సంరక్షకులన్నారు. సంత్ రవి దాస్ జయంతికి, అంబేద్కర్ జయంతికి కేసీఆర్ ఎందుకు రాడని ప్రశ్నించారు. పేదల జయంతిలకు కెసిఆర్ రావడం లేదని.. అందుకే  తెలంగాణను పేదలైన తామే పాలించుకుందామన్నారు. సంత్ రవి దాస్ గుడిని తెలంగాణలో ఎందుకు నిర్మించడం లేదన్నారు. హిందూ మతాన్ని చీల్చకుండఆ అడ్డుకున్న వారు సంత్ రవి దాస్ అన్నారు. మహనీయుల చరిత్ర తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు.