టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్లగణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన ముద్దుల కుమార్తె జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. ఈ శుభకార్యానికి బండ్లగణేష్ సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందిస్తూ.. వారిని పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
లేటెస్ట్ గా బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులను వారి నివాసంలో కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్‌కు మహేష్ బాబుతో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మహేష్ హీరోగా వచ్చిన 'బిజినెస్‌మ్యాన్' వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన గణేష్.. పలుమార్లు మహేష్‌పై తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు.
అయితే, ఓ వైపు ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంటే మరోవైపు బండ్ల గణేష్‌ను ఓ ఆస్తి వివాదం వార్తల్లో నిలిపింది. షేక్‌పేట్‌లోని అపర్ణ సినార్ వ్యాలీలో ఉన్న 500 చదరపు గజాల స్థలాన్ని పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్స్ పేరిట యూనియన్ బ్యాంక్‌లో కుదువబెట్టారు. రుణాన్ని సకాలంలో తీర్చకపోవడంతో బ్యాంక్ దానిని వేలం వేసింది. ఈ వేలాన్ని అడ్డుకోవడానికి గణేష్ హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట లభించలేదు. సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
ALSO READ : Chennai Love Story Review: ‘బేబీ’ డైరెక్టర్ నుంచి మరో ప్రేమకథ..
ఈ ఆస్తి వివాదంపై సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందించారు. ఇది కేవలం ఒకే ఒక్క 500 గజాల స్థలానికి సంబంధించిన కేసు మాత్రమే. నా మొత్తం ఆస్తులు పోయాయని, ఆర్థికంగా దెబ్బతిన్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టత ఇచ్చారు. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'వారణాసి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Producer #ganeshbandla and his family had the pleasure of meeting Superstar Mahesh Babu and Namrata Ghattamaneni to invite them to their daughter Janani’s wedding, scheduled for August 16 in Hyderabad. pic.twitter.com/tMe3MfDJrQ
— idlebrain jeevi (@idlebrainjeevi) July 23, 2026
