బంగ్లాదేశ్‌‌‌‌ క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ .పాక్‌‌‌‌పై 2–0తో సిరీస్‌‌‌‌ సొంతం

బంగ్లాదేశ్‌‌‌‌ క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ .పాక్‌‌‌‌పై 2–0తో సిరీస్‌‌‌‌ సొంతం

సిల్హెట్‌‌‌‌: బౌలింగ్‌‌‌‌లో తైజుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ (6/120) చెలరేగడంతో.. పాకిస్తాన్‌‌‌‌తో జరిగిన రెండో టెస్ట్‌‌‌‌లోనూ బంగ్లాదేశ్‌‌‌‌ 78 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 2–0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసింది. బంగ్లా నిర్దేశించిన 437 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 316/7 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో బుధవారం ఆఖరి రోజు బరిలోకి దిగిన పాక్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 97.2 ఓవర్లలో 358 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.

 మహ్మద్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ (94) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. సల్మాన్‌‌‌‌ ఆగా (71), షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌ (71), బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (47) పోరాడారు. ఐదో రోజు ఉదయం 42 రన్స్‌‌‌‌ జోడించిన పాక్‌‌‌‌.. మిగిలిన మూడు వికెట్లను కేవలం 13 బంతుల వ్యవధిలో కోల్పోయింది. టెస్ట్‌‌‌‌ల్లో తైజుల్‌‌‌‌ 18వ సారి ఐదు వికెట్ల హాల్‌‌‌‌ను ప్రదర్శించాడు. లిటన్‌‌‌‌ దాస్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, ముష్ఫికర్‌‌‌‌ రహీమ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి.