మార్చి 25న బంజారాల మహాగర్జన

మార్చి 25న బంజారాల మహాగర్జన

పంజాగుట్ట, వెలుగు: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని, ఆయన స్మృతి వనాన్ని హైదరాబాద్​లోనే ఏర్పాటు చేయాలని వివిధ బంజారా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు.  

గతంలో నగరం కుష్టు వ్యాధితో అల్లాడుతున్నప్పుడు నిజాం పిలుపు మేరకు సేవాలాల్ మహారాజ్ ఇక్కడికి వచ్చి ప్రజలను కాపాడిన చరిత్రను గుర్తు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం, బంజారాల బలాన్ని చాటడానికి మార్చి 25న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ‘బంజారాల మహాగర్జన’కు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లంబాడా హక్కుల పోరాట సమితి, బంజారా సేవా సంఘం,సేవాలాల్ సేన నాయకులు శివరాజ్ మహారాజ్, సంజీవ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.