V6 News

మంగ్లీపై కావాలనే బురద జల్లుతున్నరు : బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్ నాయక్

మంగ్లీపై కావాలనే బురద జల్లుతున్నరు : బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్ నాయక్
  •     నిరాధార ఆరోపణలు ఆపాలి
  •     బంజారా సేవా సంఘం డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: సింగర్ మంగ్లీపై జరుగుతున్న నిరాధార ప్రచారాలను మానుకోవాలని తెలంగాణ బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ హెచ్చరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. ఒక గిరిజన బిడ్డ ఎదుగుదలను జీర్ణించుకోలేక కొన్ని మీడియా సంస్థలు కావాలనే బురదజల్లుతున్నాయని ఆరోపించారు. తమ రేటింగ్స్ కోసం మంగ్లీ కుటుంబంపై నిందలు వేయడం తగదని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఈ కుట్రల వెనుక రమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉండి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. 

ప్రభుత్వం వెంటనే స్పందించి అసలైన నిందితులను శిక్షించాలని, మంగ్లీ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు సంపత్ రాథోడ్, వెంకట్, ఓయూ జేఏసీ నాయకులు రవీందర్ నాయక్, ప్రేమ్ నాయక్, సునీత పాల్గొన్నారు.