దేవుడు సాయి బాబా డబ్బులు మేం తీసుకోం.. బ్యాంకుల షాకింగ్ నిర్ణయం

దేవుడు సాయి బాబా డబ్బులు మేం తీసుకోం.. బ్యాంకుల షాకింగ్ నిర్ణయం

షిరిడీ సాయి సేవా సమితికి బ్యాంకులు షాకిచ్చాయి. సాయి బాబా డబ్బులు తీసుకోమని తేల్చి చెప్పాయి. దీంతో ఆ డబ్బును ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు సాయిబాబా ట్రస్ట్ అధికారులు. అసలు విషయం ఏంటంటే.. ప్రతి ఏటా షిరిడి సాయిబాబ గుడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువైపోతోంది. దాంతో బాబాకు కానుకలు సమర్పించే భక్తులు పెరిగిపోయారు. 

గత ఏడు నెలల్లో రూ.188 కోట్ల కానుకలు షిరిడి సాయిబాబా గుడికి వచ్చాయి. అందులో రూ.11 కోట్లకు పైగా నాణాలు ఉన్నాయి. ఈ డబ్బులన్నింటినీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ పేరు మీదున్న 13 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయితే, ఈ రూ. 11 కోట్ల నాణాలను డిపాజిట్ చేసుకోవడానికి ఏ బ్యాంకు ముందుకు రావట్లేదట. 

బ్యాంకుల్లో ప్లేస్ లేదని, అంత పెద్ద మొత్తంలో నాణాలు లెక్కించడం కష్టమని ఆ డబ్బును డిపాజిట్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ట్రస్ట్ సీఈఓ జయదేవ్ యాదవ్ ఈ విషయంలో బ్యాంకులపై కంప్లైంట్ చేస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. బాబా డబ్బులు డిపాజిట్ చేసుకోకపోవడంపై భక్తులు బ్యాంక్ అధికారులపై మండి పడుతున్నారు.